శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 09, 2021 , 12:54:04

దేశంలో 90కి చేరిన యూకే కొవిడ్‌ కేసులు!

దేశంలో 90కి చేరిన యూకే కొవిడ్‌ కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్త‌ర‌ణ కొన‌సాగుతున్న‌ది. యూకే నుంచి దేశంలోకి ప్ర‌వేశించిన ఈ కొత్త ర‌కం వైర‌స్ క్ర‌మం త‌ప్ప‌కుండా పుంజుకుంటున్న‌ది. శుక్ర‌వారం ఉద‌యానికి 82గా ఉన్న న్యూ స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య శ‌నివారం ఉద‌యానికి 90కి చేరింది. అంటే గ‌త 24 గంటల్లో దేశంలో మ‌రో 8 మందిలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ బ‌య‌ట‌ప‌డింది. కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇదిలావుంటే ఒక‌వైపు యూకేలో కొత్త‌రకం క‌రోనా వైర‌స్ వేగంగా విస్తరిస్తుంటే.. కేంద్రం భార‌త్‌-యూకే మ‌ధ్య‌ విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపివేసిన‌ట్లే నిలిపేసి మ‌ళ్లీ పునఃప్రారంభించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo