గురువారం 02 జూలై 2020
National - May 28, 2020 , 16:31:24

మిడత‌‌ల దాడి.. 90వేల హెక్టార్ల‌లో పంట న‌ష్టం

మిడత‌‌ల దాడి.. 90వేల హెక్టార్ల‌లో పంట న‌ష్టం

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్‌లో మిడ‌త‌ల దాడి వ‌ల్ల సుమారు 90 వేల హెక్టార్ల‌లో పంట న‌ష్టపోయిన‌ట్లు తెలుస్తోంది.  దాదాపు 20 జిల్లాల్లో ఈ న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  శ్రీగంగాన‌గ‌ర్‌, నాగౌర్‌, జైపూర్‌, దౌసా, క‌రౌలీ, స్వాయి మాదోపూర్ నుంచి మిడ‌త‌ల దండు.. యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైపు వెళ్లాయి. శ్రీగంగాపూర్‌లో సుమారు 4వేల హెక్టార్ల‌లో పంట న‌ష్ట‌పోయింది. నాగౌర్‌లోనూ వంద హెక్టార్ల‌లో పంట న‌ష్ట‌పోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దాదాపు 67 వేల హెక్టార్ల‌లో  మిడ‌త‌ల నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వ్య‌వ‌సాయ‌శాఖ క‌మిష‌న‌ర్ ఓం ప్ర‌కాశ్ తెలిపారు. logo