గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 08:21:36

9 నెల‌ల గ‌ర్భిణీ..అయినా న‌ర్సుగా సేవ‌లు

9 నెల‌ల గ‌ర్భిణీ..అయినా న‌ర్సుగా సేవ‌లు

క‌ర్ణాట‌క‌: ఆమె తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీ. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన స‌మ‌యంలో న‌ర్సుగా సేవ‌లందిస్తూ వృత్తి, ప్ర‌జ‌ల సేవ ప‌ట్ల త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకుంటుంది. తీర్థ‌హ‌ల్లి తాలూకాలోని గ‌జ‌నూర్ గ్రామానికి చెందిన రూపా ప‌ర్వీన్ రావు అనే మ‌హిళ తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీగా ఉన్నా..సెల‌వు తీసుకోకుండా జ‌య‌చామ రాజేంద్ర ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రోగుల‌కు సేవలందిస్తోంది.

రూపా ప‌ర్వీన్ రావు మీడియాతో మాట్లాడుతూ..ఈ ఆస్ప‌త్రి ప‌రిధిలో చాలా గ్రామాలున్నాయి. ప్ర‌జ‌లకు వైద్య సిబ్బంది సేవ‌లు అవ‌స‌రం. న‌న్ను సెల‌వు తీసుకోమ‌ని సీనియ‌ర్లు చెప్పారు. కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకున్నా. రోజూ ఆరు గంట‌లు ప‌నిచేస్తున్నా. సీఎం యెడియూర‌ప్ప నాకు ఫోన్ చేసి అభినందించారు. వృత్తిప‌ట్ల ఉన్న నిబద్ద‌త‌ను ప్ర‌శంసించారు. సీఎం కూడా న‌న్ను విశ్రాంతి తీసుకోమ‌న్నార‌ని రూపా పర్వీన్ రావు చెప్పింది. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo