మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Aug 18, 2020 , 17:26:55

24 గంటల్లో 9లక్షల కరోనా పరీక్షలు చేశాం: కేంద్రం

24 గంటల్లో 9లక్షల కరోనా పరీక్షలు చేశాం: కేంద్రం

న్యూ ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో భారతదేశంలో అత్యధిక కరోనా పరీక్షలు చేయగా, కోలుకున్న వారి సంఖ్య ఇప్పుడు సుమారు 20 లక్షల వరకు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కరోనా మరణాల శాతం 2 కంటే తక్కువగా ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 9 లక్షల పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 

మొత్తం 8,99,864 పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 19.70 లక్షలకు పైగా రోగులు కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 25 శాతం యాక్టీవ్‌ కేసులు ఉన్నాయన్నారు. రోజుకు సగటున 55000 మంది రికవరీ అవుతున్నారన్నారు. ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా ప్రజలకు పరీక్షలు చేశామన్నారు. పాజిటివ్‌ శాతం వారానికి 10 నుంచి 7.72 శాతానికి తగ్గిందని, ప్రతి ఒక్కరూ మాస్కులు, ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనాను తరిమేయాలని భూషణ్‌ పిలుపునిచ్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo