శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 19:29:11

ఘోర ప్రమాదం: 11 మంది మృతి

ఘోర ప్రమాదం: 11 మంది మృతి

ప్రకాశం జిల్లా: జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ట్రాక్టర్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్‌ స్తంభాన్ని ఢీకొన్న వెంటనే అది విరిగిపోయి కరెంట్‌ వైర్లు కూలీలపై పడి అందరికి షాక్‌ కొట్టింది. ట్రాక్టర్‌లో మొత్తం 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం. మృతులలో 9 మంది మహిళలు కాగా, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినిలు ఉన్నారు. సెలవులు ఉండటంతో విద్యార్థినిలు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి కూలీకి వెళ్లినట్లు తెలిసింది. . మృతుల వివరాలు తెలియరాలేదు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రులకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కూలీలంతా ట్రాక్టర్‌లో మిరుప పంటను కోయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.


logo