సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 13:02:00

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం : 9 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం : 9 మంది మృతి

జైపూర్‌ : రాజస్థాన్‌లోని బిగోడ్‌ పట్టణానికి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారును రాజస్థాన్‌ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భిల్వారాలోని ఆజాద్‌ నగర్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

సీఎం గెహ్లాట్‌ దిగ్భ్రాంతి

ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం గెహ్లాట్‌ ఆదేశించారు. 


logo