బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 19:20:50

అక్రమంగా భారత్ లోకి..9 మంది అరెస్ట్

అక్రమంగా భారత్ లోకి..9 మంది అరెస్ట్

అగర్తల: అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన 9 మంది బంగ్లాదేశీయుల (హిందువులు)ను త్రిపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు. 9 మంది పశ్చిమ త్రిపుర జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న మటాయి గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో..స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు కాగా..మిగిలిన వారు పిల్లలు. స్థానిక కోర్టు 9 మందికి 5 రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌, సిల్హేట్‌ జిల్లాల నుంచి త్రిపురలోకి ప్రవేశించారు. 9మంది బంగ్లాదేశీయులను కలవగా..వారు శాశ్వతంగా భారత్‌లోనే ఉంటామని చెప్పారని స్థానిక ఎమ్మెల్యే, ఐపీఎఫ్‌టీ నేత బ్రిక్షకేటు దెబర్మ తెలిపారు. మేం ఏ కులానికిగానీ, మతానికిగానీ, ప్రాంతానికిగానీ వ్యతిరేకం కాదని, అయితే పౌరసత్వ సవరణ చట్టానికి మాత్రం తాము వ్యతిరేకమని బ్రిక్షకేటు దెబర్మ అన్నారు. బంగ్లాదేశీయులు అధికారికంగా భారత్‌లో ఉండేందుకు హక్కు లేదని చెప్పారు. 


logo