సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 23:43:27

మహారాష్ట్రలో కరోనా కల్లోలం

మహారాష్ట్రలో కరోనా కల్లోలం

ముంబై : మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాలు అంతే స్థాయిలో పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం మవుతున్నది. ఆ రాష్ట్రంలో శుక్రవారం 9615 కరోనా కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 3,57,117 కరోనా కేసులు నమోదుకాగా 1,43,714 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 1,99,967క మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 13,132 మంది మృతి చెందారు. ఇవాళ ఒక్కరోజే 5714 మంది రోగులను డిశ్చార్జి కాగా 278 మంది మరణించారని, బులెటిన్ పేర్కొంది. ముంబైలో కరోనా విలయం సృష్టిస్తోంది. కేవలం ముంబై నగరంలోనే 1,06,980 కేసులు నమోదు కాగా 5,984 మంది మృతి చెందారు. శుక్రవారం ముంబైలోని ధారవి ప్రాంతంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఈ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 2,519కి చేరగా, వీరిలో 2,141 మంది డిశ్చార్జికాగా 128 మంది చికిత్స పొందుతున్నారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.


logo