గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 18:54:44

పంజాబ్ లో కొత్త‌గా 87 పాజిటివ్ కేసులు..మొత్తం 1731

పంజాబ్ లో కొత్త‌గా 87 పాజిటివ్ కేసులు..మొత్తం 1731

చండీగ‌ఢ్‌: పంజాబ్ లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్క‌రోజే కొత్త‌గా 87 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1731కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 39 మంది మృతి చెందార‌ని పంజాబ్ వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.

పంజాబ్ లో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో పోలీస్ యంత్రాంగం లాక్ డౌన్ నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం చేస్తోంది.  ప్ర‌జ‌లు ఇండ్ల‌లోనే ఉండి స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని, అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో త‌ప్ప రోడ్ల‌పైకి ఎవ‌రూ రాకూడ‌ద‌ని సూచ‌న‌లు జారీచేశారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo