శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 10:02:38

క‌రోనా పాజిటివ్‌.. 24 గంట‌ల్లో 86,961 కేసులు

క‌రోనా పాజిటివ్‌.. 24 గంట‌ల్లో 86,961 కేసులు


హైద‌రాబాద్‌: దేశంలో కరోనా వైర‌స్ కేసుల ఉదృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది.  గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా దేశ‌వ్యాప్తంగా 86,961 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 24 గంట‌ల్లోనే 1130 మంది వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించారు.  దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54.87 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది.  దీంట్లో యాక్టివ్ కేసులు 10,03,299 ఉన్నాయి.  ఇక హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,96,399గా ఉంది.  ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 87, 882గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.