గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 12:45:07

వ‌ర‌దల‌తో వ‌ణికిపోతున్న అసోం

వ‌ర‌దల‌తో వ‌ణికిపోతున్న అసోం

దిస్పూర్‌: అసోంలో వ‌ర‌ద ఉధృతి తీవ్ర‌రూపం దాల్చింది. రాష్ట్రంలో భారీ వాన‌లు కురుస్తుండ‌టంతో 70 ల‌క్ష‌లపైగా మంది వ‌ర‌ద‌ల వ‌ల్ల‌ ప్ర‌భావిత‌మైన‌ట్లు ముఖ్య‌మంత్రి సోనోవాల్ స‌ర్బానంద సోనోవాల్ ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ల‌వ‌ల్ల తాజాగా ఆరుగురు మ‌ర‌ణించ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 85 మంది మృతిచెందార‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ఓవైపు క‌రోనాతో ఇబ్బంది ప‌డుతుండ‌గా, మ‌రోవైపు వ‌ర‌ద‌లు రాష్ట్రాన్ని అత‌లాకులం చేస్తున్నాయ‌ని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు అన్నివిధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నాయ‌ని వెల్ల‌డించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు, జంతువుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌న్నారు. 

వ‌ర‌ద ప‌రిస్థితిపై అసోం సీఎం సోనోవాల్‌తో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. ఏ విధ‌మైన స‌హాయానికైనా కేంద్రం సిద్ధంగా ఉన్న‌ద‌ని ప్ర‌ధాని హామీ ఇచ్చారు. బ్ర‌హ్మ‌పుత్రా న‌ది ఇప్ప‌టికే ప్ర‌మాద స్థాయిని దాటి ప్ర‌వ‌హిస్తుండ‌గా, క‌చ‌ర్ జిల్లాలో బ‌రాక్ న‌ది ఉప్పొంది ప్ర‌వ‌హిస్తున్న‌ది. వ‌ర‌ద‌ల వ‌ల్ల తొమ్మిది ఖ‌డ్గ‌మృగాల‌తో స‌హా 108 జంతువులు చ‌నిపోయాయ‌ని రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ ప్ర‌క‌టించింది. 


logo