బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 20:10:41

ధారవిలో కొత్తగా 85 కరోనా కేసులు

ధారవిలో కొత్తగా 85 కరోనా కేసులు

ముంబై: ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 85 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారవిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1327కు చేరింది. ఇక మరణాలు కూడా ధారవిలో క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ధారవి మురికివాడలో మొత్తం 56 మంది కరోనా బారినపడి మృతిచెందారు. బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. 


logo