ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 11:24:40

80 మంది టీచ‌ర్ల‌కు క‌రోనా.. మూత‌బ‌‌డ్డ 84 స్కూళ్లు

80 మంది టీచ‌ర్ల‌కు క‌రోనా.. మూత‌బ‌‌డ్డ 84 స్కూళ్లు

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లో గ‌త కొన్నిరోజులుగా క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్ర‌త్యేకంగా రాష్ట్రంలో పాఠ‌శాల‌లు తెరిచిన‌ప్ప‌టి నుంచి పాజిటివ్ ఇది అధికంగా క‌న్పిస్తున్న‌ది. ఈనెల 1న రాష్ట్రంలో పాఠ‌శాల‌లు ప్రారంభ‌మ‌య్యాయి. అప్ప‌టినుంచి ఒక్క‌ పౌరీ జిల్లాలోనే 80 మంది ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో జిల్లాలోని ఐదు బ్లాకుల్లో 84 పాఠ‌శాల‌ల‌ను ఐదు రోజుల‌పాటు మూసివేశారు. ఈనేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌‌మ‌త్త‌మ‌య్యింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విధుల‌కు హాజ‌రవుతున్న ఉపాధ్యాయుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు జిల్లా మేజిస్ట్రేట్ల‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి అమిత్ నేగీ ఆదేశాలు జారీ చేశారు.   

రాష్ట్రంలో న‌వంబ‌ర్ 1న‌ పాఠ‌శాల‌లు ప్రారంభ‌మ‌య్యాయి. బోర్డ్ ప‌రీక్ష‌ల‌ నేప‌థ్యంలో ప‌ది, 12వ‌ త‌ర‌గ‌తి విద్యార్థులు పాఠ‌శాల‌లు హాజ‌రు కావ‌చ్చ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప‌రిస్థితులను బ‌ట్టి మిగిలిన త‌ర‌గ‌తుల‌ను కూడా ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. అయితే పాఠ‌శాల‌ల‌కు హాజ‌ర‌వుతున్న ఉపాధ్యాయులు క‌రోనా బారిన‌ప‌డుతుండ‌టంతో స‌ర్కార్ పున‌రాలోచ‌న‌లో ప‌డింది.