ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 13:11:13

తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మందికి కరోనా పాజిటివ్‌

తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మందికి  కరోనా పాజిటివ్‌

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉన్నది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5,849 మందికి కరోనా నిర్ధారణ కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  1,86,492కు చేరింది.  తమిళనాడు  రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాజ్‌భవన్‌లోపల  విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది, ఫైర్‌ సర్వీస్‌  స్టాఫ్‌తో సహా 84 మందికి కరోనా సోకింది.

కరోనా   బారినపడ్డవారెవరూ కూడా గవర్నర్‌, ఉన్నతాధికారులతో కాంటాక్ట్‌ కాలేదని రాజ్‌భవన్‌ అధికారులు తెలిపారు. బాధితులందరినీ ఆరోగ్యశాఖ అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  ముందుజాగ్రత్త చర్యగా రాజ్‌భవన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో క్రిమిసంహారక రసాయనాలతో  స్ర్పే చేశారు.  logo