బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 20:39:51

ప‌శ్చిమ‌బెంగాల్ లో కొత్త‌గా 84 పాజిటివ్ కేసులు

ప‌శ్చిమ‌బెంగాల్ లో కొత్త‌గా 84 పాజిటివ్ కేసులు

కోల్‌క‌తా: ప‌శ్చిమబెంగాల్ లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఇవాళ  ఒక్క రోజే కొత్త‌గా 84 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య  2461కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 153 మంది మృతి చెంద‌గా..ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో 72మంది మృతి చెందార‌ని వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. మ‌రోవైపు రాష్ట్రంలో మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతుంది. కంటైన్‌మెంట్ జోన్లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo