శుక్రవారం 05 జూన్ 2020
National - May 11, 2020 , 10:27:37

రాజస్థాన్‌లో మరో 84 కరోనా పాజిటివ్‌లు

రాజస్థాన్‌లో మరో 84 కరోనా పాజిటివ్‌లు

జైపూర్‌: రాజస్థాన్‌లో కొత్తగా 84 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3898కు పెరిగింది. ఈ వైరస్‌ ఇప్పటివరకు 108 మంది మరణించారు. రాష్ట్రంలో 1537 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో ఉదయ్‌పూర్‌లో అత్యధికంగా 40, జైపూర్‌లో 11, అజ్మిర్‌లో 6, చిత్తోర్‌గఢ్‌లో 5, కోటాలో 3, జలోర్‌లో 4 చొప్పున ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువగా జైపూర్‌లో 1230, జోధ్‌పూర్‌లో 873 ఉన్నాయి.  

దేశంలో గత 24 గంటల్లో 4213 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67,152కి పెరిగింది.  


logo