ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 20:15:39

‘ఏడాదిలో ట్రిపుల్ తలాక్ కేసులు 82 శాతం తగ్గాయి’

‘ఏడాదిలో ట్రిపుల్ తలాక్ కేసులు 82 శాతం తగ్గాయి’

న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన ఏడాదిలోనే 82 శాతం కేసులు తగ్గాయని, జులై 30వ తేదీని ముస్లిం మహిళలు హక్కుల దినోత్సవంగా గుర్తుంచుకుంటారని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. గురువారం ట్రిపుల్ తలాక్ బిల్లు తొలి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడారు. 1985లో లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నా బిల్లును తీసుకురాలేదని, నాడే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు తీసుకువచ్చి ఉంటే ముస్లిం మహిళల పరిస్థితి మరోలా ఉండేదన్నారు.

బిల్లుకు మద్దతుగా నిలిచి రాజ్యాంగ విరుద్ధ ట్రిపుల్ తలాక్‌పై జాతిలో చైతన్యం తెచ్చిన ముస్లిం సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలపై విశ్వాసం ఉందని, సరైన వ్యక్తి చేతిలో దేశం ఉందని వారు నమ్ముతున్నారని పేర్కొన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020ని దేశ సంప్రదాయాలు, సంస్కృతి ఆధారంగా రూపొందించామని, భవిష్యత్‌ తరాలకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని చెప్పారు.logo