శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 11:30:37

ఆ క్లినిక్‌కు వెళ్లిన 800 మందికి క్వారంటైన్‌..

ఆ క్లినిక్‌కు వెళ్లిన 800 మందికి క్వారంటైన్‌..

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని మోహల్లా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పని చేస్తున్న డాక్టర్‌తో పాటు ఆయన భార్య, కూతురుకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో.. ఆ ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకున్న వారిపై ఢిల్లీ ప్రభుత్వం దృష్టి సారించింది. మార్చి 12 నుంచి 18వ తేదీ మధ్యలో చికిత్స పొందిన వారి వివరాలను ఢిల్లీ ఆరోగ్య శాఖ తీసుకుంది.

మొత్తం 800 మంది చికిత్స పొందినట్లు తేలింది. ఈ 800 మందిలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ మహిళ ఉంది. ఈమె ద్వారానే వైద్యుడికి కరోనా సోకినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు. ఇప్పటికే వైద్యుడితో పాటు ఆయన భార్య, కూతురును ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇప్పుడు 800 మందిని క్వారంటైన్‌లో ఉంచాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 36కు చేరింది. 


logo