బుధవారం 27 మే 2020
National - May 17, 2020 , 08:49:12

దేశంలో 80 శాతం కరోనా కేసులు 30 మున్సిపాలిటీల్లోనే

దేశంలో 80 శాతం కరోనా కేసులు 30 మున్సిపాలిటీల్లోనే

న్యూఢిల్లీ: దేశంలో 80 శాతం కరోనా కేసులు 12 రాష్ర్టాల్లోని 30 మున్సిపాలిటీల్లోనే నమోదవుతున్నాయి. దీంతో ఆ మున్సిపాలిటీల్లోని ఓల్డ్‌ సిటీలు, మురికివాడలు, వలస కూలీల శిబిరాలు, అత్యధిక జనసాంద్రత ఉండే ప్రాంతాల్లో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం మున్సిపల్‌ అధికారులను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లోని గ్రేటర్‌ ముంబై, గ్రేటర్‌ చెన్నై, అహ్మదాబాద్‌, థానే, ఢిల్లీ, ఇండోర్‌, పుణె, కోల్‌కతా, జైపూర్‌, నాసిక్‌, జోధ్‌పూర్‌, ఆగ్రా, తిరువల్లూర్‌, ఔరంగాబాద్‌, కడలూరు, గ్రేటర్‌ హైదరాబాద్‌, సూరత్‌, చెంగల్‌పట్టు, అరియలూర్‌, హౌరా, కర్నూలు, భోపాల్‌, అమృత్‌సర్‌, విల్లుపురం, వడోదర, ఉదయ్‌పూర్‌, పాల్ఘర్‌, బెర్హంపూర్‌, షోలాపూర్‌, మీరట్‌ మున్సిపాలిటీల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగోవిడత లాక్‌డౌన్‌లో భాగంగా ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా, నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మార్చి 25న అమల్లోకి వచ్చింది. అయితే పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను విడతలవారీగా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మూడో విడత లాక్‌డౌన్‌ గడువు నేటితో ముగియనుంది.


logo