శుక్రవారం 03 జూలై 2020
National - Apr 19, 2020 , 17:57:51

రాజస్థాన్‌లో మరో 80 కరోనా కేసులు

రాజస్థాన్‌లో మరో 80 కరోనా కేసులు

జైపూర్‌: రాజస్థాన్‌లో కొత్తగా 80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1431కి చేరింది. ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈరోజు నమోదైన కేసుల్లో భోపాల్‌లో 17, జోధ్‌పూర్‌లో 30, నాగౌర్‌లో 12, జైపూర్‌లో 7, ఇతరప్రాంతాల్లో ఒకటీ, రెండు చొప్పున ఉన్నాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ర్టాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15712 కేసులు నమోదుకాగా, 507 మంది మరణించారు.logo