శనివారం 04 జూలై 2020
National - Jun 29, 2020 , 13:34:12

3 గంట‌ల్లోనే అమ్ముడుపోయిన వందేభార‌త్ టికెట్లు

3 గంట‌ల్లోనే అమ్ముడుపోయిన వందేభార‌త్ టికెట్లు

హైద‌రాబాద్‌: వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకురానున్నారు. అయితే దీని కోసం ఆదివారం విమాన టికెట్ల‌కు బుకింగ్ చేశారు. ఎయిర్ ఇండియా విమానాల్లోని సీట్ల‌న్నీ కేవ‌లం మూడు గంట‌ల్లోనే అమ్ముడుపోయాయి.  దీంతో చాలా మంది ప్ర‌యాణికులు నిరుత్సాహానికి లోన‌య్యారు. సిడ్నీ, మెల్‌బోర్న్ నుంచి జూలై 1, 14వ తేదీల్లో నాలుగు విమానాల‌ను ఆప‌రేట్ చేయ‌నున్న‌ట్లు శ‌నివారం ఎయిర్ ఇండియా ప్ర‌క‌టించింది.  ఆదివారం మ‌ధ్యాహ్నం బుకింగ్ విండోను ఓపెన్ చేశారు.  మధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు సీట్ల‌న్నీ అమ్ముడుపోయిన‌ట్లు అధికారులు చెప్పారు. మొత్తం 2048 సీట్ల‌ను బుక్ చేసిన‌ట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. 



logo