శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 26, 2020 , 13:30:17

యూకే నుంచి వచ్చిన 8 మందికి కరోనా

యూకే నుంచి వచ్చిన 8 మందికి కరోనా

తిరువనంతపురం: దేశంలో కరోనా కొత్త వైరస్‌ కలకలం సృష్టిస్తున్నది. తాజాగా యూకే నుంచి కేరళకు వచ్చినవారిలో 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారి నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. వారిలో కరోనా స్ట్రెయిన్‌ లక్షణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పరీక్షించనున్నారు. ఈనేపథ్యంలో యూకే నుంచి వచ్చినవారికి మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.

రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మరణాల రేటు తగ్గిందని చెప్పారు.