శనివారం 29 ఫిబ్రవరి 2020
కుప్పకూలిన ఫుట్‌ ఓవర్‌ వంతెన

కుప్పకూలిన ఫుట్‌ ఓవర్‌ వంతెన

Feb 14, 2020 , 02:44:29
PRINT
కుప్పకూలిన ఫుట్‌ ఓవర్‌ వంతెన
  • 8 మందికి గాయాలు..
  • మధ్యప్రదేశ్‌లో ఘటన

భోపాల్‌, ఫిబ్రవరి 13: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ రైల్వేస్టేషన్‌లోని ఒక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కూలిపోవడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని, అతడికి దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు పశ్చిమ మధ్య రైల్వే సీపీఆర్వో ప్రియాంక దీక్షిత్‌ తెలిపారు. మిగతా ఏడుగురు క్షతగాత్రుల్లో ఇద్దరికి చికిత్స చేసి డిశ్చార్జీ చేశారు. మరో ఐదుగురు స్థానిక ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 
logo