బుధవారం 15 జూలై 2020
National - Apr 08, 2020 , 09:10:06

త‌బ్లిఘి జ‌మాత్ లింక్..8 మంది విదేశీయుల‌పై కేసు

త‌బ్లిఘి జ‌మాత్ లింక్..8 మంది విదేశీయుల‌పై కేసు

నాగ్ పూర్‌: మ‌హారాష్ట్ర‌లో 8 మంది విదేశీయుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నాగ్ పూర్ లో త‌బ్లిఘి జ‌మాత్ తో లింక్ ఉన్న 8 మంది..ఫారిన‌ర్స్ యాక్ట్‌, టూరిస్ట్ వీసా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్లు గుర్తించామ‌ని నాగ్ పూర్ త‌హ‌సీల్ స్టేష‌న్ సీనియ‌ర్ పోలీస్ ఇన్ స్పెక్ట‌ర్ జ‌యేశ్ భండార్క‌ర్ తెలిపారు.

8 మంది విదేశీయులు పోలీసుల‌కు స‌మాచార‌మివ్వ‌కుండా నాగ్ పూర్ లోని ఓ మ‌సీదులో ఉంటున్న‌ట్లు గుర్తించి..వారంద‌రినీ క్వారంటైన్ కు త‌ర‌లించామ‌ని వెల్ల‌డించారు. త‌బ్లిఘి జ‌మాత్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వ్య‌క్తులు స్వ‌చ్చందంగా ముందుకొచ్చి అధికారులు, పోలీసుల‌కు స‌మాచారమివ్వాల‌ని జ‌యేశ్ భండార్క‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo