శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 17:29:47

ఆస్ట్రేలియాకు ఎనిమిది ఎయిరిండియా ఫ్లైట్స్‌

ఆస్ట్రేలియాకు ఎనిమిది ఎయిరిండియా ఫ్లైట్స్‌

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌, లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన 'వందే భారత్ మిషన్' కింద భార‌త్‌-ఆస్ట్రేలియా మధ్య ఎనిమిది విమానాలను నడుపనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జూలై 1 నుంచి జూలై 14 వరకూ విమానాల ఆపరేషన్ కొన‌సాగుతుంద‌ని తెలిపింది. ఈ నెల 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమవుతుంద‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. 

అయితే, ఆ ఫ్లైట్ల బుకంగ్ ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. నాలుగు విమానాలు సిడ్నీకి, నాలుగు విమానాలు మెల్‌బోర్న్ వరకు వెళ్తాయని తెలిపింది. 'వందే భారత్ మిషన్' కింద ఎయిర్ ఇండియా దాని అనుబంధ సంస్థ‌లు మే 7 నుంచి అంతర్జాతీయంగా విమానాలు నడుపుతున్నాయి. జూన్ 1 వరకు 423 అంతర్జాతీయ విమానాల్లో 58,867 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు.


logo