పాట్నా, జూన్ 25: బీహార్లోని ఛాప్రాలో ఓ వ్యాక్సిన్ సెంటర్లో నర్సు టీకా మందు నింపకుండా ఖాళీ సిరంజితోనే యువకుడికి ఇంజెక్షన్ వేశారు. ఆ యువకుడి మిత్రులు సరాదాగా తీసిన వీడియోతో ఈ విషయం తెలిసింది. టీకా కేంద్రం నుంచి వెళ్లిన కొన్ని గంటల తర్వాత వారు వీడియోను చూసి నర్సు నిర్వాకాన్ని గుర్తించారు. దీనిపై వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సును అధికారులు విధుల నుంచి తొలగించారు. ఇంజెక్షన్ వేసిన తర్వాత తనకు తలనొప్పి వచ్చిందని యువకుడు తెలిపాడు.