సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 21:52:12

మ‌హారాష్ర్ట‌లో 10 వేల‌కు చేరువ‌లో క‌రోనా మృతులు

మ‌హారాష్ర్ట‌లో 10 వేల‌కు చేరువ‌లో క‌రోనా మృతులు

ముంబై : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆ రాష్ర్ట ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిర అవుతున్నారు. శుక్ర‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 7,862 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 2,38,461 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్ం మృతుల సంఖ్య 9,893కు చేరింది. 1,32,625 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని మ‌హారాష్ర్ట ప్ర‌జారోగ్య శాఖ వెల్ల‌డించింది. 

మ‌హారాష్ర్ట‌లో ముంబైలో అత్య‌ధికంగా కేసులు న‌మోదు కాగా, పుణె జిల్లా రెండో స్థానంలో ఉంది. దీంతో పుణెలో ఈ నెల 13 నుంచి 23వ తేదీ వ‌ర‌కు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించ‌నున్నారు. నాందేడ్ జిల్లాలో జూలై 12న అర్థ‌రాత్రి నుంచి జూలై 20 అర్థ‌రాత్రి వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు.


logo