గురువారం 04 జూన్ 2020
National - May 13, 2020 , 15:25:37

భ‌వ‌నంపై నుంచి దూకి వృద్ధుడి ఆత్మ‌హ‌త్య‌

భ‌వ‌నంపై నుంచి దూకి వృద్ధుడి ఆత్మ‌హ‌త్య‌

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఓ వృద్ధుడు ఆస్ప‌త్రి నాలుగో అంత‌స్తు నుంచి దూకి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఇండోర్‌లోని కోట్వాలీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. న్యుమోనియా వ్యాధి, శ్వాస సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఒక 78 ఏండ్ల‌ వృద్ధుడు ఇటీవ‌ల ఇండోర్‌లోని ఎంటీహెచ్ ఆస్ప‌త్రిలో చేరాడు. బుధ‌వారం ఉద‌యం ఉన్న‌ట్టుండి ఆస్ప‌త్రి నాలుగో అంత‌స్తు నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బుధ‌వారం ఉద‌యం 7.30 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ద‌ని కోట్వాలీ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌చార్జి బీడీ త్రిపాఠి తెలిపారు. వృద్ధుడి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo