గురువారం 04 జూన్ 2020
National - May 14, 2020 , 09:12:59

78,003 కేసులు.. 2549 మ‌ర‌ణాలు

78,003 కేసులు.. 2549 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు మ‌రింత విజృంభిస్తున్న‌ది. క్ర‌మంగా త‌ప్ప‌కుండా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న‌ది. ప్ర‌తిరోజూ వేల‌ల్లో కొత్త కేసులు, వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి గురువారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం 24 గంట‌ల వ్య‌ధిలో కొత్త‌గా 3,722 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 78,003కు చేరింది. 

మ‌రోవైపు దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే అన్ని రాష్ట్రాల్లో క‌లిపి 134 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,549కి చేరింది. కాగా, దేశంలో న‌మోదైన మొత్తం కేసుల‌లో ప్ర‌స్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగ‌తా వారిలో 26,235 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 2549 మంది మ‌ర‌ణించారు.    

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo