గురువారం 02 జూలై 2020
National - Jul 01, 2020 , 13:00:22

రాజ‌స్థాన్‌లో 78, నాగాలాండ్‌లో 21 క‌రోనా కేసులు

రాజ‌స్థాన్‌లో 78, నాగాలాండ్‌లో 21 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: రాజ‌స్థాన్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల నుంచి బుధ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 78 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ప‌ద్దెనిమిది వేల మార్కును దాటి 18,092కు చేరింది. మొత్తం కేసుల‌లో 3,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగ‌తా వారు వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక రాజ‌స్థాన్‌లో మ‌ర‌ణాల సంఖ్య కూడా 413కు చేరింది. రాజ‌స్థాన్ వైద్య ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ఇక, నాగాలాండ్‌లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి మెల్ల‌మెల్ల‌గా విస్త‌రిస్తున్న‌ది. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు 24 గంట‌ల్లో కొత్త‌గా 21 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో నాగాలాండ్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 480కి చేరింది. అందులో 168 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 312 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నాగాలాండ్ ఆరోగ్య‌శాఖ మంత్రి పాంగ్‌న్యూ ఫోమ్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.   

  


logo