ఆదివారం 29 నవంబర్ 2020
National - Sep 02, 2020 , 10:53:18

దేశంలో ఒకే రోజు 78,357 కరోనా కేసులు.. 1,045 మరణాలు

దేశంలో ఒకే రోజు 78,357 కరోనా కేసులు.. 1,045 మరణాలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్నది. నిత్యం 50వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 78,357 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 37లక్షల మార్కును దాటాయి. ప్రస్తుతం మొత్తం కేసుల  సంఖ్య 37,69,524కు చేరాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం 8,01,282 యాక్టివ్‌ కేసులు ఉండగా, 29,01,909 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. 24 గంటల్లో 1,045 మృతి చెందగా.. ఇప్పటి వరకు 66,333 మంది వైరస్‌తో మరణించినట్లు తెలిపింది. కాగా, మంగళవారం ఒకే రోజు 10,12,367 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 4,43,37,201 టెస్టులు చేసినట్లు వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.