సోమవారం 13 జూలై 2020
National - Jun 29, 2020 , 16:15:06

మరో 77 మంది పోలీసులకు కరోనా

మరో 77 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో మరో 77 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడిన పోలీసుల సంఖ్య 1,030కి చేరింది. మరోవైపు ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కరోనా వల్ల ఇద్దరు పోలీసులు మరణించారు. దీంతో వైరస్‌ బారినపడి చనిపోయిన పోలీసుల సంఖ్య 59కి చేరింది. 

మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. కరోనాపై పోరాటంలో ముందున్న పోలీసులు కూడా వైరస్‌ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే వెయ్యి మందికిపైగా పోలీసులకు కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో సుమారు 60 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుశాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలున్న పోలీసులకు వైద్యసేవల కోసం మూడు ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాలను ఇటీవల ప్రారంభించింది. logo