శుక్రవారం 03 జూలై 2020
National - Jun 29, 2020 , 16:24:06

మ‌రో 77 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్

మ‌రో 77 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్

ముంబై : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. ఈ వైర‌స్ ధాటికి మ‌హారాష్ర్ట ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రో 77 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇద్ద‌రు పోలీసులు క‌రోనాతో చ‌నిపోయారు. మ‌హారాష్ర్ట పోలీసు విభాగంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,030కి చేరుకోగా, మృతుల సంఖ్య 59కి చేరింది. క‌రోనా విజృంభ‌ణ‌తో పోలీసులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

మ‌హారాష్ర్ట‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1,64,626 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 7,429 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో అత్య‌ధికంగా 75,539, థానేలో 34,257, పుణెలో 20,870, పాల్గ‌ర్ లో 5,267, ఔరంగాబాద్ లో 4,833 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.


logo