శనివారం 04 జూలై 2020
National - May 24, 2020 , 19:15:22

త‌మిళ‌నాడులో 765.. చెన్నైలో 587 కొత్త కేసులు

త‌మిళ‌నాడులో 765.. చెన్నైలో 587 కొత్త కేసులు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తిరోజు 500ల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కూడా కొత్త‌గా 765 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో త‌మిళ‌నాడులో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 16, 277కు చేరింది. మొత్తం కేసుల‌లో 7,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక ఆదివారం కొత్త‌గా 8 మంది మ‌ర‌ణించ‌డంతో మొత్తం మ‌రుణాల సంఖ్య 111కు చేరింది. కాగా, ఆదివారం న‌మోదైన మొత్తం కేసుల‌లో ఒక్క చెన్నైలోనే 587 కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో చెన్నై న‌గ‌రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,576కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ అధికారులు ఆదివారం సాయంత్రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 


logo