శనివారం 04 జూలై 2020
National - Jun 19, 2020 , 06:54:42

‘గల్వాన్‌'లో 76 మంది జవాన్లకు గాయాలు: ఇండియన్‌ ఆర్మీ

‘గల్వాన్‌'లో 76 మంది జవాన్లకు గాయాలు: ఇండియన్‌ ఆర్మీ

న్యూఢిల్లీ: లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది భారతీయ జవాన్లు గాయపడ్డారని ఆర్మీ అధికారులు ప్రకటించారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వారు త్వరలోనే విధుల్లో చేరుతారని వెల్లడించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారు 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని తెలిపారు. మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. 

సోమవారం పొద్దుపోయిన తర్వాత గల్వాన్‌ లోయలోని పెట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద చైనా సైనికులు భారత బలగాలపై రాళ్లు, ఇనుప రాడ్లు, కట్టెలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందులో 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు సుమారు 45 మంది చనిపోయి ఉండవచ్చని భారత ఆర్మీ ప్రకటించింది. అయితే మృతుల సంఖ్యను చైనా అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 


logo