శుక్రవారం 10 జూలై 2020
National - Jun 03, 2020 , 10:48:32

లాక్‌డౌన్‌లో రోడ్డుప్రమాదాలు.. 750 మంది మృతి

లాక్‌డౌన్‌లో రోడ్డుప్రమాదాలు.. 750 మంది మృతి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా.. భారత్‌లో లాక్‌డౌన్‌ విధించిన విషయం విదితమే. లాక్‌డౌన్‌ కాలంలో మార్చి 24 నుంచి మే 30వ తేదీ మధ్యలో ఘోరమైన రోడ్డుప్రమాదాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా 1,461 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 750 మంది ప్రాణాలు కోల్పోయారు. 26.4 శాతం మంది వలస కూలీలు రోడ్డుప్రమాదాల్లో మరణించారు. 5.3 శాతం మంది నిత్యావసర పనులకు వెళ్లి చనిపోయారు. ఈ వివరాలను సేవలైఫ్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది.

అయితే నాలుగో దఫా లాక్‌డౌన్‌లో అత్యధికంగా 322 మంది రోడ్డుప్రమాదాలకు బలయ్యారు. మూడో దఫా లాక్‌డౌన్‌లో సుమారు 60 శాతం మంది వలస కూలీలు రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 245 మంది చనిపోగా, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో 56 మంది చొప్పున మరణించారు. 


logo