బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 16:17:58

బామ్మ‌ మార్ష‌ల్ ఆర్ట్స్ చూసి షాక్ అయిన బాలీవుడ్ హీరో!

బామ్మ‌ మార్ష‌ల్ ఆర్ట్స్ చూసి షాక్ అయిన బాలీవుడ్ హీరో!

క‌రోనా నేప‌త్యంలో పొట్ట‌కూటి కోసం ఎవ‌రి మీద ఆదార‌ప‌డ‌కుండా తోపుడు బండి మీద కూర‌గాయ‌లు పెట్టుకొని లేదంటే పూలు అమ్ముకునో జీవ‌నం సాగిస్తుంటారు కొంత‌మంది క‌ష్ట‌జీవులు. వ‌య‌సు మీద ప‌డినా నాకేం కొడుకులు ఉన్నారు క‌దా వారే చూసుకుంటారులే అని బాధ్య‌త‌ల‌న్నీ వారిపై మోప‌కుండా పూణెకు చెందిన 75 ఏండ్ల వృద్ద మ‌హిళ రోడ్డు మీద‌కు వ‌చ్చి మార్ష‌ల్ ఆర్ట్స్ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తూ ఉపాధి పొందుతున్న‌ది.

75 ఏండ్లు గ‌ల ఆజి మా త‌న‌కు వ‌చ్చిన విద్య‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి వెనుకాడ‌కుండా రెండు క‌ర్ర‌లను చేతిలో ప‌ట్టుకొని గిరా గిరా తిప్పేస్తున్న‌ది. మార్ష‌ల్ ఆర్ట్స్‌కు ఫిదా అయిన వారు తోచిన సాయం చేస్తున్నారు. ఆజి మా క‌ర్ర తిప్పుకుంటే సినిమాల్లో హీరోలే గుర్తొస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మొద‌ట హ‌తీంద‌ర్ సింగ్ అనే వ్య‌క్తి ట్విట‌ర్‌లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ అయింది. ఆమె నైపుణ్యాలు చూసి బాలీవుడ్ హీరో రితీష్ రీట్వీట్  చేశారు. 'ఆమె వివ‌రాలు తిలిసిన వారెవ‌రైనా నాకు చెప్ప‌గ‌ల‌రా' అంటూ రితీష్ ట్వీట్ చేశారు. త‌ర్వాత ప్ర‌త్యేక ట్వీట్‌లో 'అజీ మాత‌ను క‌నెక్ట్ అవ్వ‌డం వ‌ల్ల లాభ‌దాయ‌క‌మ‌ని పేర్కొన్నారుస‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోను 9 ల‌క్ష‌ల‌కుపైగానే వీక్షించారు. ఏదేమైనా ఈ బామ్మ‌కు స‌లాం కొట్టాల్సిందే..  


logo