ఆదివారం 31 మే 2020
National - May 08, 2020 , 21:31:56

ముంబైలో ఒక్క‌రోజే 748 క‌రోనా కేసులు

ముంబైలో ఒక్క‌రోజే 748 క‌రోనా కేసులు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం కొత్త‌గా 1089 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌హారాష్ట్ర‌లో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 19063కు చేరింది. అయితే, కొత్త‌గా న‌మోదైన 1089 కేసుల‌లో 748 కేసులు ముంబై న‌గ‌రంలోనివే కావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా కేసుల‌తో క‌లిపి ముంబైలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 11,967కు చేరింది. ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా శుక్ర‌వారం మ‌రో 37 మంది మ‌ర‌ణించడంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 731కి చేరుకుంది. కాగా రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,470 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ శుక్ర‌వారం రాత్రి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 


logo