ఆదివారం 31 మే 2020
National - May 20, 2020 , 19:15:28

తమిళనాడులో కొత్తగా 743 కరోనా కేసులు

తమిళనాడులో కొత్తగా 743 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం కొత్తగా 743 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,191కు చేరింది. తాజాగా కరోనా వల్ల మరో ముగ్గురు చనిపోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. బుధవారం సాయంత్రం వరకు  5882 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. logo