శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 22:27:23

మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి 10 నెలలు పట్టింది

మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి 10 నెలలు పట్టింది

తిరువనంతపురం : మహారాష్ట్రలోని నాసిక్ నుంచి బయల్దేరిన ఈ భారీ లారీ.. కేరళ చేరుకునేందుకు పది నెలల సమయం పట్టింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. 1,700 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన ఈ 74 చక్రాలున్న భారీ వాహనం 70 టన్నుల ఆటోక్లేవ్‌ను మోసుకెళ్లింది. పది నెలల అనంతరం శనివారం సురక్షితంగా తిరువనంతపురంలోని గమ్యస్థానమైన అంతరిక్ష పరిశోధన సంస్థ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నది.

సాధారణంగా ఒక ట్రక్ ఇదే మొత్తం కిలీమీటర్లను ప్రయాణించేందుకు కేవలం వారం రోజుల సమయం తీసుకుంటుంది. అయితే ఈ భారీ వాహనం రోజుకు కేవలం ఐదు కిలోమీటర్లే ప్రయాణిస్తుంది. ఈ భారీ వాహనం నడుస్తున్నప్పుడు ఆ రోడ్డు మీదుగా ఇతర వాహనాలను ప్రయాణించుకుండా చూడాలి.  2019 సెప్టెంబర్ 1 న ప్రారంభమైన ఈ వాహనం ప్రయాణం ఎన్నో అవరోధాలను ఎదుర్కొని సాఫీ గమ్యస్థానానికి చేరుకున్నది. ఈ ట్రక్కు వెంట ప్రయాణించిన 30 మంది బృందంలో ఇంజనీర్లు, మెకానిక్ లు ఉన్నారు. ఆటోక్లేవ్ వివిధ కార్యక్రమాల కోసం ఏరోస్పేస్ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 


logo