ముంబై : ముంబై నగరంలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 727 మంది పోలీసుల్ని ఇతర జిల్లాలకు బదిలీ చేయనున్నారు. 727 మందిలో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి సీనియర్ ఇన్స్పెక్టర్ స్ధాయి అధికారులు ఉన్నారు. ముంబైలో 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన పోలీసులను త్వరలోనే బదిలీ చేయనున్నారు. అయితే దశలవారీగా బదిలీలు ఉంటాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. బదిలీ అయ్యే పోలీసుల జాబితాను జూన్ 28వ తేదీన రిలీజ్ చేశారు. దాంట్లో 89 మంది సీనియర్ ఇన్స్పెక్టర్లు, 253 మంది ఇన్స్పెక్టర్లు, 375 మంది ఏఎస్ఐలు, పది మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.