సోమవారం 01 జూన్ 2020
National - May 12, 2020 , 20:27:31

త‌మిళ‌నాడులో ఒక్క రోజే 716 పాజి‌టివ్ కేసులు..మొత్తం 8718

త‌మిళ‌నాడులో ఒక్క రోజే 716 పాజి‌టివ్ కేసులు..మొత్తం 8718

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజే అత్య‌ధికంగా 716 క‌రోనాపాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8718కు చేరుకుది. ఇప్ప‌టివ‌ర‌కు 2134 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జయ్యారు.

క‌రోనాతో ఒక్క రోజే 8 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 61గా న‌మోదైందని త‌మిళనాడు ఆరోగ్య‌, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. మ‌రోవైపు క‌రోనా కేసుల ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో కంటైన్ మెంట్ జోన్ల‌లో ప్ర‌జ‌లు లాక్ డౌన్ పాటించేలా పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప బ‌య‌ట‌కు వ‌స్తే కేసులు న‌మోదు చేస్తున్నారు.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo