బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 11:29:20

ఈ వృద్దురాలికి 60 పెంపుడు కుక్క‌లున్నాయి! అవి ఎందుకంటే..

ఈ వృద్దురాలికి 60 పెంపుడు కుక్క‌లున్నాయి! అవి ఎందుకంటే..

ఎవ‌రికైనా ఒక‌టి, రెండు పెంపుడు జంతువులు ఉంటాయి. మ‌రీ ఎక్కువ ఇష్టం అయితే ఇంట్లో ఎంత‌మంది ఉంటే అంతమంది ఎవ‌రికి వారు పెంచుకుంటారేమో. మ‌రి 70 ఏండ్ల ఈ బామ్మ ఏంటి 60 కుక్క‌ల‌ను పెంచుకుంటుంది. పోనీ ఆమె ఏమైనా డ‌బ్బున్న మ‌నిషా అంటే కాదు. కూతురు పెంట్రోల్ బంక్‌లో ప‌నిచేస్తుంది. వ‌చ్చిన డ‌బ్బుతో వీరిద్ద‌రు జీవించ‌డ‌మే కాకుండా 60 కుక్క‌లకు క‌డుపు నింపుతున్న‌ది. మామూలుగా ఈ మ‌హిళ రెండు కుక్క‌ల‌ను పెంచుకుంటున్న‌ది.

అయితే కొన్ని కుక్క‌లు గాయాల‌తో, మ‌రికొన్ని కుక్క‌లు ఒక కాలు లేకుండా రోడ్డున తిరుగుతుండ‌టం చూసి ఆమె మ‌న‌సు చ‌లించిపోయింది. ఆమె పెంచుకునే రెండు కుక్క‌ల్లానే మిగ‌తా కుక్క‌లు క‌నిపించేస‌రికి వాటిని కూడా చేర‌దీస్తూ వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇలా ఈమె 60 కుక్క‌ల‌ను చేర‌దీసింది. వీటికి ప్ర‌తిరోజూ క‌డుపు నింపుతూ ఆమె సంతోషంగా జీవిస్తున్న‌ది. ఈ త‌ల్లీ-కూతుళ్ల గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. వీరిద్ద‌రు నిండు నూరేళ్లు చ‌ల్ల‌గా ఉండాల‌ని ఆశీర్వ‌దిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకున్న‌ది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 


logo