శుక్రవారం 03 జూలై 2020
National - May 06, 2020 , 11:34:51

70 ప్రత్యేక రైళ్లు.. 80 వేల మంది కూలీలు

70 ప్రత్యేక రైళ్లు.. 80 వేల మంది కూలీలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కూలీలను భారతీయ రైల్వే తరలిస్తున్నది. గత ఐదు రోజుల్లో 70 ప్రత్యేక రైళ్లలో సుమారు 80 వేల మంది వలస కార్మికులను తరలించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో రాష్ర్టాలు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో సోమవారం నాటికి 55 రైళ్లు వివిధ రాష్ర్టాల్లోని గమ్యస్థానాలకు చేరాయని, మరో 30కిపైగా రైళ్లు మంగళవారం చేరుకున్నాయని రేల్వై అధికారులు పక్రటించారు. ప్రతి రైల్లో సుమారు వెయ్యి నుంచి 1200 మంది కార్మికులు, విద్యార్థులు, తీర్థయాత్రికులు ఉంటున్నారని తెలిపారు. 

వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలకు వెళ్తున్న లేదా అక్కడి నుంచి బయల్దేరుతున్నాయని తెలిపారు. 

వలస కూలీలకు సంబంధించిన టికెట్‌ ఖర్చులను ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రలు పూర్తిగా భరిస్తుండగా, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలు తమ రాష్ర్టానికి వచ్చే కూలీలకు సంబంధించిన టికెట్లకు డబ్బులు చెల్లిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాలు తమ వద్ద నుంచి వెళ్తున్న వల కూలీల ఖర్చులను భరిస్తున్నాయి.


logo