శనివారం 23 జనవరి 2021
National - Nov 29, 2020 , 14:52:10

70.97 శాతం మ‌ర‌ణాలు 8 రాష్ట్రాల నుంచే..!

70.97 శాతం మ‌ర‌ణాలు 8 రాష్ట్రాల నుంచే..!

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కొనసాగుతున్న‌ది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో కొంచెం త‌క్కువ‌గానే ఉన్నా, ఉత్తరాది రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఉత్తరాదిలోనే ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కూడా కొత్త‌గా 496 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అందులో కేవ‌లం 8 రాష్ట్రాలు/‌కేంద్రపాలిత ప్రాంతాల‌‌ నుంచే అత్య‌ధికంగా కేసులు న‌మోద‌య్యాయి. అంటే కొత్త‌గా న‌మోదైన 496 క‌రోనా మ‌ర‌ణాల్లో ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, హ‌ర్యానా, పంజాబ్‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ల నుంచే 70.97 శాతం ఉన్నాయి.   


logo