శుక్రవారం 10 జూలై 2020
National - Jun 02, 2020 , 08:14:10

జమ్ములో ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌

జమ్ములో ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌ వద్ద దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పట్టుబడ్డ ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47, పిస్తోల్‌, గ్రనేడ్లు, పాకిస్థాన్‌ ముద్రలున్న వస్తువులతోసహా భారీమొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి నాలుగు రోజులుగా ఆపరేషన్‌ కొనసాగిస్తున్నామని నాగ్రోటా కార్ప్స్‌ అధికారులు ప్రకటించారు. గత నెల 28న నియంత్రణా రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, ఒకరికి గాయాలయ్యాయి.


logo