గురువారం 04 జూన్ 2020
National - May 08, 2020 , 06:00:27

గంగాన‌దిలో రెండు ప‌డ‌వ‌లు బోల్తా: 8 మంది గల్లంతు

గంగాన‌దిలో రెండు ప‌డ‌వ‌లు బోల్తా: 8 మంది గల్లంతు

బిహార్‌:  రాష్ట్రంలో క‌తిహార్‌లోని కుర్సేలా పోలీస్‌స్టేష‌న్ ప్రాంతంలోని గుమ్తి తోలా స‌మీపంలో గంగాన‌దిలో రెండు ప‌డ‌వ‌లు బోల్తాప‌డ్డాయి. ప్ర‌మాదంలో ఐదుగురు సుర‌క్షితంగా ఈత‌కొట్టుకుంటూ బ‌య‌ట‌కు రాగా 8 మంది గ‌ల్లంత‌య్యారు. గోబ్రిహి డియారా గ్రామం నుంచి వాట‌ర్‌మిల‌న్‌తో కూడిన ప‌డ‌వ‌ల్లో 13 మంది ప్ర‌యాణికులు కూడా ఉన్నారు. న‌ది మ‌ధ్య‌లోకి రాగానే బ‌ల‌మైన గాలులు వీయ‌డంతో ప‌డ‌వ‌లు న‌దిలో తిర‌గ‌బ‌డ్డాయి. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న‌వారు గ‌ల్లంత‌య్యారు. గ‌ల్లంతైన వారిలో గుమ్తి తోలా గ్రామానికి చెందిన ఫారూక్‌(48), ఖుష్బున్‌(28), ష‌బ్నం(14), మిసాబ్బుల్‌(12) వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మ‌హ్మ‌ద్ ఆయుబ్‌(25), అత‌ని తండ్రి మొహ్మ‌ద్ అఫ్జ‌ల్‌, మ‌రో ఇద్ద‌రు వ్యాపారులు ఉన్నారు, వారి వివ‌రాలు తెలియ‌రాలేదు. కుర్సేల స‌ర్కిల్ ఇన్స్‌పెక్ట‌ర్ దినేష్‌కుమార్ త‌న సిబ్బందితో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. డైవ‌ర్ల స‌హాయంతో గ‌ల్లంతైన వారికోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఖ‌గారియా నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. క‌తిహార్ జిల్లా క‌లెక్ట‌ర్ క‌న్వాల్ త‌నూజ్ గాలింపు చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 


logo