బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 19:23:39

కేరళలో కొత్తగా ఏడు కేసులే..

కేరళలో కొత్తగా ఏడు కేసులే..

తిరువనంతపురం: కేరళలో సోమవారం కొత్తగా ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇవాళ ఒక్కరు కూడా డిశ్చార్జ్‌ కాలేదన్నారు. కొత్తగా కరోనా సోకిన వారిలో నలుగురు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్ర నుంచి రాగా మరో ఇద్దరు  చెన్నైనుంచి రాష్ట్రానికి  వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ కేరళలో 519 మందికి కరోనా సోకింది. 489 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 27 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

ఆదివారం వరకు కేరళకు 1,307 మంది విదేశాల నుంచి తిరిగొచ్చారు. 650 మంది హోం క్వారంటైన్‌లో ఉండగా..641 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంటున్నారు. 16 మందిని మాత్రం హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశారు. కేరళకు వచ్చిన 1307 మందిలో 229 మంది గర్భిణీలు ఉన్నట్లు వైద్యాశాఖ అధికారులు వివరించారు. logo