శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 20:40:05

జార్ఖండ్ లో కొత్త‌గా 7 కేసులు

జార్ఖండ్ లో కొత్త‌గా 7 కేసులు

రాంఛీ: జార్ఖండ్ లో కొత్త‌గా 7 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో హ‌జారీబాఘ్ లో 6, రాంఛీలో ఒక కేసు న‌మోదైంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 172కు చేరిన‌ట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. 

క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్రం ఆదేశాల మేర‌కు జార్ఖండ్ లో  మూడో ద‌శ లాక్ డౌన్ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎలాంటి స‌డ‌లింపులు ఉండ‌వ‌ని సీఎం హేమంత్ సోరెన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.  లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రోడ్ల‌పైకి వ‌స్తున్న‌వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నారు. వాహ‌నాలు సీజ్ చేస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo