శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 18:31:26

బీహార్‌లో నోటాకు 7.06 ల‌క్ష‌ల ఓట్లు

బీహార్‌లో నోటాకు 7.06 ల‌క్ష‌ల ఓట్లు

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార కూట‌మి ఎన్డీఏకే ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టంగ‌ట్టారు. బీజేపీ, జేడీయూ మ‌రో రెండు చిన్న‌పార్టీల‌తో కూడిన ఎన్డీఏ కూట‌మికి 125 సీట్లు రాగా.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల‌తో కూడిన మ‌హా కూట‌మి 110 స్థానాల్లో విజ‌యం సాధించింది. ఇదిలావుంటే బీహార్‌లో దాదాపు 7 ల‌క్ష‌ల మందికిపైగా ఓట‌ర్లు None Of  The Above (NOTA) ఆప్ష‌న్ ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. బీహార్‌లో 7,06,252 మంది నోటా బ‌ట‌న్ నొక్కార‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. మొత్తం పోలైన ఓట్ల‌లో నోటా వాటా 1.7 శాతం ఉంద‌ని పేర్కొన్న‌ది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.